‘రేవంత్ పక్కా తెలంగాణ ద్రోహి’
TG: కృష్ణా ట్రిబ్యునల్ సాక్షిగా తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా లాయర్లు అవమానిస్తుంటే సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సిగ్గు లేకుండా మౌనంగా ఉన్నారని మాజీమంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఉద్యమం రాజకీయాల కోసమే జరిగిందంటుంటే ఎందుకు ఖండించరని నిలదీశారు. రేవంత్ పక్కా తెలంగాణ ద్రోహి అని, అందుకే ఆంధ్రా వాళ్లు ఏం అన్నా నోరు మూసుకొని కూర్చున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.