CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
W.G: పొడూరు మండలం కొమ్ముచిక్కాల టీడీపీ క్యాంప్ కార్యాలయంలో 65 మంది లబ్ధిదారులకు రూ.30,10,316ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.