అంగన్వాడీ కేంద్రం తరలింపుపై కలెక్టర్ కీలక నిర్ణయం

అంగన్వాడీ కేంద్రం తరలింపుపై కలెక్టర్ కీలక నిర్ణయం

CTR: తవణంపల్లి మండలం జొన్నగురకల గ్రామపంచాయతీలోని చంగనపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని తరలించవద్దని గ్రామస్థులు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కోరారు. గ్రామస్థులు సమర్పించిన వినతిని కలెక్టర్ పరిశీలించారు. వెంటనే జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి, ఆ కేంద్రాన్ని తరలించకుండా కొనసాగించడంతో పాటు మెయిన్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.