VIDEO: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణ
జనగామ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు మంత్రి ధనసరి సీతక్క హాజరైన సందర్భంగా శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదే కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొనడంతో ఎమ్మెల్యే ఎవరు అనే అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దిగగా.. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.