వైసీపీ విద్యార్థి విభాగం కార్యదర్శిగా రాజమోహన్
కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం కార్యదర్శిగా అయినవిల్లి మండలం నేదునూరుకు చెందిన రాజమోహన్ నియమితులు అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలో విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రాజమోహన్ ఆదివారం తెలిపారు.