VIDEO: 'హోలీ హోలీలో రంగమ్మోలి' అంటూ సందడి
NLG: గతంలో హోలీ పండుగకు వారం రోజుల ముందే చిన్నారుల పాటల సందడి వినిపించేది. కాలక్రమేణా ఆ సందడి తగ్గుముఖం పట్టినప్పటికీ, చిట్యాల మండలం, పెద్దకాపర్తిలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించాయి. మంగళవారం గ్రామంలోని వృద్ధ మహిళలు ఏకమై 'హోలీ హోలీలో రంగమ్మోలి' అంటూ జానపద పాటలు పాడుతూ సందడి చేశారు. కనుమరుగవుతున్న ఈ సంప్రదాయాన్ని వారు నేటి తరానికి గుర్తు చేశారు.