కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం

KMR: బీర్కూర్ మండలం బరంగేడ్ది గ్రామానికి చెందిన సందుల లతకు కళ్యాణ లక్ష్మి చెక్కును కాంగ్రెస్ నాయకులు శనివారం అందజేశారు. మండల నాయకులు శంకర్ మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి వరంలాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పూల్సింగ్, కాంగ్రెస్ నాయకులు బోయిని శంకర్, గోండ్ల శ్రీనివాస్ వున్నారు.