యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

KRNL: ఆదోని మండలం పెద్ద హరివాణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రైతు సంఘం ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన తెలిపారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కే.వెంకటేశులు మాట్లాడుతూ.. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే చెప్పిన మాటలు రైతులకు ఉపయోగం లేకుండా పోయాయని విమర్శించారు. తక్షణమే యూరియా సరఫరా చేయాలని, లేని పక్షంలో అగ్రికల్చర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.