ఎర్రవల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన

ఎర్రవల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన

GDWL: ఎర్రవల్లిలో సోమవారం  నిర్వహించిన "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో ఎస్పీ టి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షితంగా ప్రయాణించాలని ఆయన సూచించారు. ప్రమాద రహిత జిల్లాగా మార్చడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.