పుంగనూరులో వీధి కుక్కల హల్‌చల్

CTR: పుంగనూరు పట్టణంలో వీధి కుక్కల బెడద తీవ్రం కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. నారప్ప కాలనీ, పోలీస్ లైన్, ఎన్ఎస్ పేట, కుమ్మరవీధి ప్రాంతాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బైకులు, పాదాచారుల వెంటపడుతున్నాయి. పలువురిపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.