ఏపీ లింగోటం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరి మృతి
NLG: నార్కట్‌పల్లి మండల పరిధిలోని ఏపీ లింగోటం ఫ్లైఓవర్‌పై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న తక్కెళ్ళపల్లి గ్రామానికి చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.