అగ్ని ప్రమాద బాధితుడుకి జనసేన సాయం

VZM: భోగాపురం మండలం చేపల కంచేరు అగ్ని ప్రమాద బాధితులకు జనసేన నాయకులు బుధవారం సాయమందించారు. గ్రామంలో పోల ఎల్లయ్య పూరిల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బాధితుడుకి ఆర్థిక సాయమందించడంతో పాటు నిత్యావసరాలు అందించారు. ఇందులో మండల అధ్యక్షుడు రమణ నాయకులు మట్ట అప్పయ్య రెడ్డి, పడాల శ్రీను, బొల్లు త్రినాథ్ పాల్గొన్నారు.