ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్
ELR: ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలోని మండల స్థాయిలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కె. వెట్రి సెల్వితో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల వినతులను కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.