డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా మల్లన్న పట్నాలు
KNR: హుజురాబాద్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా సిర్సపల్లి ఐలోని మల్లన్న దేవాలయం సమీపంలో భారీగా మల్లన్న పట్నాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని ప్రజలకు మద్దతు తెలిపారు. MLA మాట్లాడుతూ.. “మల్లన్న దేవాలయం పవిత్రతకు భంగం కలిగే విధంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.