సైబర్ మోసాలకు పాల్పడిన వ్యక్తులు అరెస్ట్

సైబర్ మోసాలకు పాల్పడిన వ్యక్తులు అరెస్ట్

GNTR: దుబాయ్‌కి చెందిన ఎ అండ్ టీ గేమింగ్ కంపెనీతో సంబంధాలు పెట్టుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురిని గుంటూరు అరండల్ పేట పోలీసులు అరెస్టు చేశారు. అధిక లావాదేవీలు చేయడం ద్వారా సిబిల్ స్కోర్ పెరుగుతుందని నమ్మించి వీరు సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.