ఆర్మీ చీఫ్ జోష్.. యంగ్ ఆఫీసర్లతో పుషప్స్!
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. డెహ్రాడూన్ IMAలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం కొత్తగా విధుల్లోకి చేరనున్న యువ అధికారులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. ఈ క్రమంలో వారితో పోటీపడుతూ మైదానంలో పుషప్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వయసులో కూడా ఆయన ఫిట్‌నెస్ చూసి నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు.