టాలెంట్ టెస్ట్‌లో పల్వంచ విద్యార్థిని టాప్
KMR: పల్వంచ మండలానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యాశ్రీ జిల్లా స్థాయి బయోసైన్స్ టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచింది. కామారెడ్డిలో నిర్వహించిన పరీక్షలో మొత్తం 97 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యాశ్రీని జిల్లా విద్యాధికారి రాజు, మెమెంటోతో సత్కరించినట్లు ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి తెలిపారు.