ధోనీ ఇంటికి టీమిండియా ప్లేయర్లు

ధోనీ ఇంటికి టీమిండియా ప్లేయర్లు

రాంచీలో ప్రాక్టీస్‌ చేస్తోన్న భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్, రుతురాజ్‌ గైక్వాడ్ ఇవాళ ధోనీ ఇంటికి వెళ్లారు. ధోనీతో కోహ్లీకి మంచి అనుబంధం ఉంది. ఇక వికెట్‌ కీపింగ్‌లో మార్గదర్శిగా ధోనీని పంత్ చెబుతుంటాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ సారథి రుతురాజ్‌ చాన్నాళ్లుగా ధోనీ కలిసి ఐపీఎల్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.