విజయవాడ ఏసీపీ కీలక ప్రకటన

NTR: అనధికార చీటీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. చట్టబద్ధత లేని, మోసపూరితమైన చీటీల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాంటి చీటీల గురించి ఎవరైనా చెబితే, పూర్తి సమాచారం తెలుసుకోవాలని, అనుమతులు లేకుండా చీటీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.