VIDEO: లింగాపూర్‌లో అంబేద్కర్ జయంతి ర్యాలీ
KMR: లింగాపూర్‌లో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని కౌన్సిలర్లు నరేందర్ రెడ్డి, కాసర్ల రాణి శ్రీనివాస్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పురవీధుల గుండా భారీ ర్యాలీని ప్రారంభించారు. సామాజిక సమన్యాయం కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.