VIDEO: తీజ్ నృత్యాలు చేస్తున్న మహిళలు

ADB: నార్నూర్ మండలంలోని చొర్గావ్ గ్రామంలో బుధవారం తీజ్ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మథుర మహిళలు, చిన్నారులు కలిసి తమ సంప్రదాయబద్దంగా నృత్యాలు చేశారు. అనంతరం మట్టితో వివిధ రకాల బొమ్మలు తయారు చేసి పూజలు చేశారు. కార్యక్రమంలో షేర్ సింగ్, అర్జున్ లాట్య, రమేష్ పటేల్, పంచశీల్, తదితరులు పాల్గొన్నారు.