రూ. 9.23 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
KRNL: కర్నూలు నగర అభివృద్ధే ప్రధాన అజెండా అని నగరపాలక సంస్థ మేయర్ బీవై రామయ్య అన్నారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన జరిగిన స్థాయి సంఘ సమావేశానికి కమిషనర్ పి.విశ్వనాథ్ హాజరయ్యారు. రూ. 9.23 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన 36 అజెండాలను ఈ సమావేశంలో ఆమోదించారు.