'ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి'

SKLM: జిల్లా కేంద్రంలోని స్థానిక న్యాయస్థానంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా జడ్జి అహ్మద్ మౌలానా ప్రారంభించారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కక్షిదారులకు, న్యాయవాదులకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.