500 లీటర్ల బెల్లపు ఊటలు ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు

SKLM: నవోదయం 2.O నాటు సారా నిర్మూలనలో భాగంగా మందస మండలం కారిగాం గ్రామంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. సోంపేట ఎక్సైజ్ కె.బేబీ ఆధ్వర్యంలో కారిగాం కొండ ప్రాంతంలో ఎస్‌టిఎఫ్, ఎస్‌హెచ్‌ఓ జరిపిన సంయుక్త దాడులలో 500 లీటర్ల బెల్లపు ఊటలు ధ్వంసం చేశారు. నాటు సారా తయారీకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.