'ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి'

'ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి'

PDPL: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ వాణిశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రసవాలను పెంచాలని, ప్రతి ఫుల్‌టర్మ్ గర్భిణీని ట్రాక్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు.