VIDEO: తూప్రాన్‌లో 9.1 సెంటీమీటర్ల వర్షం

MDK: తూప్రాన్ మండలంలో మెదక్ జిల్లాలోని అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం రాత్రి రెండు గంటల్లోనే భారీ వర్షం కురవడంతో ప్రజలు అతలాకుతలమయ్యారు. తూప్రాన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మున్సిపల్ అధికారులు మ్యాన్ హోల్స్ తెరిచి నీరు పోయే విధంగా ప్రయత్నాలు చేశారు.