రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవం

రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవం

VZM: శ్రీరామనవమి సందర్భంగా రామతీర్థం పుణ్యక్షేత్రంలో రేపు ఉదయం 10:30 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ఈ పవిత్ర వేడుకకు భక్తులందరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి విచ్చేయాలని పేర్కొన్నారు. లోక కల్యాణం కోసం జరిగే ఈ దివ్య కార్యక్రమానికి అందరూ హాజరై, సీతారాముల కృపాకటాక్షాలు పొందాలని ఆమె కోరారు.