సండే ఆన్ సైకిల్ కార్యక్రమం
ప్రకాశం: పోలీస్ కార్యాలయంలో ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, ఆదివారం “Sunday’s on Cycle” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా AR DSP శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆధునిక జీవనశైలిలో వాహనాలపై అధికంగా ఆధారపడటం వల్ల వ్యాయామం తగ్గిపోతూ.. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సైక్లింగ్ చేస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండవచ్చని తెలిపారు.