ఇంట్లో చోరీ... నగదు అపహరణ

RR: షాద్ నగర్ పట్టణంలోని రతన్ కాలనీలో గుర్తుతెలియని దుండగులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డ దుండగులు రూ.5 లక్షల నగదు, ల్యాప్ టాప్, సెల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమాని వనజ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.