'వాగ్ధానాలు కాదు.. పనులే నిదర్శనం'

RR: మన్సురాబాద్ డివిజన్ కాస్మోపాలిటన్ కాలనీలో ఓపెన్ స్పేస్ బేస్‌మెంట్ గ్రౌండ్ అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధివృద్ధిలో భాగంగా బోర్ వెల్, చైన్ లింక్ మెష్, గేటు ఏర్పాటు వంటి పనులకు రూ.15 లక్షల నిధులు కేటాయించబడ్డాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాల కోసం వాగ్ధానాలు కాదు.. పనులే నిదర్శనమని అన్నారు.