బస్సులు ఆపాలని వినతిపత్రం

బస్సులు ఆపాలని వినతిపత్రం

RR: రాత్రి 9 గంటలు దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి షాద్ నగర్‌కు రావడానికి ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని షాద్ నగర్ పట్టణ వాసులు తెలిపారు. ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డులో బస్సులను ఆపాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజినల్ మేనేజర్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ సేవాసమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఉన్నారు.