స్వామివారి దర్శనానికి కాలినడకన 45 కిలోమీటర్లు

స్వామివారి దర్శనానికి కాలినడకన 45 కిలోమీటర్లు

SKLM: బూర్జ మండలం మామిడివలస గ్రామానికి చెందిన శ్రీహరి భక్తులు శనివారం రాత్రి మామిడి వలస గ్రామం నుంచి కాలినడకన బయలుదేరి ఆదివారం ఉదయం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయానికి చేరుకున్నారు. హరినామ సంకీర్తన చేస్తూ సుమారు 100 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 45 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనందాన్ని కలిగించిందన్నారు.