రైతులకు GOOD NEWS
TG: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. గత యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సన్న వడ్లకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమచేయనుంది. ఈ క్రమంలో అధికారులు బకాయిల రైతుల వివరాలు తీసుకుని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ. 1159 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. విడతల వారీగా లబ్దిదారులకు అందించనుంది.