రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

ప్రకాశం: కంభం మండలంలోని హజరత్ గూడెంలో గల శనగ పంటను మండల వ్యవసాయ అధికారి షేక్ మొహమ్మద్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శనగ పంట దాదాపుగా 3500 ఎకరాల సాగు చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం అక్కడక్కడ ఎండు తెగులు కనిపిస్తుందని నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. తెగులు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని ఆయన అన్నారు.