18 నుంచి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్
SDPT: ఈ నెల 18 నుంచి 31వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో సీహెచ్ ధన్ రాజ్ తెలిపారు. దేశంలో 2030లోగా కుష్ఠు వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పక్షం రోజులపాటు వ్యాధిగ్రస్థుల గుర్తింపు కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని, నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు.