బోడుప్పల్ అభయ హాస్పిటల్‌లో అమానుషం
MDCL: బోడుప్పల్ అభయ హాస్పిటల్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. డబ్బులు లేవని రోగి నాగమ్మకు ఆక్సిజన్ తగ్గించారన్న కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో నాగమ్మ మృతి చెందింది. అంతేకాదు డబ్బులు కట్టి డెడ్ బాడీ తీసుకెళ్లాలని హాస్పిటల్ ఒత్తిడి చేసిందని కుటుంబం సభ్యులు ఆందోళన చేశారు. సమాచారం అందుకుని మీడియా రావడంతోనే బాడీని ఇచ్చినట్లు సమాచారం.