ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

MHBD: నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో నూతనంగా నిర్మించనున్న శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల సంకల్పంతో నిర్మించబోతున్న ఈ ఆలయం, భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి మార్గదర్శకంగా ఉండాలని ఆకాంక్షించారు.