రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సు
NTR: ఎ. కొండూరు మండలం, కంభంపాడు జెడ్పీ హైస్కూల్లో జరిగిన అవగాహన సదస్సుకు డీసీపీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన సూచించారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ అలవాట్ల దుష్ఫలితాలు, ఫోక్సో చట్టం, సైబర్ నేరాలపై ఆయన అవగాహన కల్పించారు.