MPPSను సందర్శించిన రాష్ట్ర మానిటరింగ్ అధికారులు

GNTR: పెదకాకాని మండలం వెనిగండ్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్రస్థాయి మానిటరింగ్ అధికారులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మధ్యాహ్న భోజన పథకం అమలు, రికార్డులు, పాఠశాల భౌతిక వసతులు, లీప్‌యాప్ నమోదు వంటి అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్శనలో మండల విద్యాధికారి బీవీ. రమణయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.