విశాఖ మెట్రో.. మరో అడుగు

AP: విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు ప్లానింగ్, టెండర్ల ప్రక్రియకి కన్సల్టెన్సీ ఎంపిక కోసం మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లను పిలిచింది. ఈ సమావేశానికి 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. టెండర్లు వేసేందుకు జూన్ 8 వరకు గడువు ఉండగా, జూన్ 9న ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు.