గంజాయి సరఫరా.. కేసు నమోదు
బాపట్ల జిల్లాలో ఒడిశా-వేటపాలెంకు గంజాయి విక్రయిస్తున్న ముఠాని చీరాల పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వివరాల మేరకు.. గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న ఓ యువకునితో పాటు, గంజాయి సేవించేందుకు కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు సీఐ శేషగిరిరావు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 1250 గ్రాముల నిషేదిత గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.