VIDEO: 'సాంప్రదాయబద్ధంగా తీజ్ ఉత్సవాలు'

ADB: గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో తీజ్ ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని గ్రామస్తులందరూ ఒక్క దగ్గరికి చేరి పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం లయబద్ధంగా సాంస్కృతిక పాటలకు అనుగుణంగా మహిళలు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.