మద్యం సీసాలు స్వాధీనం వ్యక్తి అరెస్ట్

VZM: గజపతినగరం ప్రోహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల బొండపల్లి మండలం బి రాజేరు గ్రామంలో సీఐ జనార్దనరావు ఆధ్వర్యంలో బుధవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పది మద్యం సీసాలతో కొట్నాన అశోక్ కుమార్ పట్టుబడగా ఆ వ్యక్తిని ఆధీనంలోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్సై నరేంద్రకుమార్ హెచ్‌సీలు భాష లోకాభిరామ్, కానిస్టేబుళ్లు ఫాతిమా బేగం సౌజన్య పాల్గొన్నారు.