VIDEO: కోటిపల్లిలో క్రమేపి పెరుగుతున్న గోదావరి ఉధృతి
కోనసీమ: గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. కె.గంగవరం మండలం కోటిపల్లి రేవు పుష్కర ఘాట్ వద్ద ఆదివారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలు కారణంగా వరద పెరగడంతో నీటి ఉధృతి పెరిగిందని స్థానికులు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా గోదావరిలో స్నానం ఆచరించే వారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.