VIDEO: ఇస్త్రీ షాప్‌లో ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకున్న ఎర్రబెల్లి
MHBD: మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. బుధవారం తొర్రూరు మున్సిపాలిటీ 12వ వార్డు ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇస్త్రీ షాప్‌లో బట్టలు ఇస్త్రీ చేస్తూ ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. ఈ వినూత్న ప్రచారం స్థానికుల దృష్టిని ఆకర్షించింది.