అక్రమ కేసులు పెట్టడం ఆనవాయితీగా మారింది: మాజీ మంత్రి

NLR: అక్రమ కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వానికి అనవాయితీగా మారిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న మైనింగ్ బయట పెట్టాలని డ్రోన్ కెమెరాతో వీడియోలు తీయడానికి వెళ్తే హత్య చేయడానికి వచ్చారాని అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు.