అత్తింటి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
కృష్ణా: పెడన మండలం అర్తమూరు గ్రామానికి చెందిన బెక్కం లిఖిత అనే వివాహిత మంగళవారం తన పుట్టింట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాది క్రితమే ఆమె వివాహం జరగగా.. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, అత్తింటి వేధింపులే లిఖిత ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.