హెల్మెట్ వేసిన వారికి స్వీట్లు, లేకపోతే ఫైన్
BPT: కర్లపాలెం పోలీసులు గురువారం సత్యవతిపేట వద్ద వినూత్న కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించి నిబంధనలు పాటిస్తూ వచ్చిన వాహనదారులకు స్వీట్లు పెట్టి అభినందించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వారిని ఆపి ప్రమాదంలో జరిగే నష్టం వివరించి ఫైన్ విధించారు. ఎస్సై రవీంద్ర మాట్లాడుతూ.. నియమాలు పాటించే వారిని ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.