గద్వాల రైతులకు పెట్టుబడి సాయం జమ

గద్వాల రైతులకు పెట్టుబడి సాయం జమ

గద్వాల జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సాగుకు ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం ఆదివారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. తొలి విడతలో 1,69,299 మంది రైతులకు ప్రాధాన్యత ఇస్తారు. ఫిబ్రవరి 28లోపు పాస్‌బుక్‌లు పొందిన మరో 6 వేల మందికి కూడా సాయం లభిస్తుంది. జిల్లాలో 3.52 లక్షల ఎకరాలకు ఈ సాయం అందనుంది.