రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని HMM పాఠశాలలో ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ అధినేత రూపానంద రెడ్డి శనివారం తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం ఉంటుందన్నారు. కంటి సమస్య ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.